SAKSHITHA NEWS

సామాజిక వర్గాల సింహ స్వప్నం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ *
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొని, ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు.

◆ వందల ఏళ్ళ క్రితమే సమాజ హితం కోరి సామజిక వర్గాల అభ్యున్నతిని చాటిచెప్పిన మహనీయులు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు స్వరాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గౌడ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS