పాల్వంచ బ్రహ్మాకుమారీ పద్మజ ఆధ్వర్యంలో
మూగ చెవిటి పాఠశాలలో శ్రీ కృష్ణా జన్మదిన మరియు రాఖీ వేడుకలు
ప్రిన్సిపాల్ క్రిసోలైట్ సేవలు అభినందనీయం ~ బ్రహ్మాకుమారీ పద్మజ
శ్రీ కృష్ణాజన్మ దిన మరియు రాఖీ సందర్భంగా
పాల్వంచ బ్రహ్మా కుమారీ పద్మజ పాల్వంచలోని మూగ చెవిటి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ
శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోహిణి నక్షత్రం వృషభలగ్నంలో అర్థరాత్రి సకల శుభ లక్షణాలతో దివ్య తేజస్సు వెదజల్లుతూ దేవికి, వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడని , ఆసమయంలో దేవతలు పూల వర్షం కురిపించారని అదొక మహోత్తరమైన దృశ్య కావ్యం అని ఇలాంటి దేశంలో మనం జన్మించడం పూర్వ జన్మ సుకృతం అని తెలిపారు
అనంతరం పద్మజ
మానసిక దివ్యాంగుల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు వారందరికీ రాఖీ కట్టి మిఠాయి తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు
బ్రహ్మాకుమారీ పద్మజ ప్రిన్సిపాల్ క్రిసోలైట్ గారి సేవలు అద్భుతం అని శాలువాతో చిరు సన్మానం చేసి వారిని అభినందించారు.
నేటి సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే జీవించడం కష్టం. అలాంటిది మూగ చెవిటి, మానసిక వికలాంగులకు సేవలు అందిస్తున్నందకు చాలా సంతోషంగా ఉందని భగవంతుడు మీకు గొప్ప భాధ్యత ఇచ్చారు అని ఆమెకు ఆత్మీయ అభినందనలు తెలిపారు
భగవంతునికి నిజమైన సేవలు చేయడమంటే
ప్రతి ఒక్కరం భగవంతునికి దగ్గరగా జీవించడమేనని భగవంతుని తెలుసుకొని ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి పది మందికి అందించినపుడే నిజమైన ఆనందం సంతోషం సత్యమైన జీవితం దొరుకుతుందని పద్మజ అన్నారు
ప్రతి ఒక్కరం మెడిటేషన్ ను అలవాటు చేసుకోవాలని తద్వారా అంతర్లీనంగా ఉండే మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆత్మ జ్ఞానాన్ని పొందగలము అన్నారు దీని కోసం మన పాల్వంచ KSP రోడ్ గల రాజయోగ మెడిటేషన్ సెంటర్ లో ఉచితంగా నేర్పించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరాలకు ఈ ఫోన్ నంబర్ 9246777886 కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.