దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి
సాక్షిత, తిరుపతి: దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి చేయాలని పౌర గ్రంథాలయ సంచాలకులు ఎం.ఆర్.ప్రసన్న కుమార్ సూచించారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. సందర్శనలో భాగంగా గ్రంధాలయములో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. గ్రంథాలయంలో అమర్చిన పుస్తకాలను పరిశీలించి, గ్రంథాలయ పరిసరాలు ఆవరణలంతా పరిశుభ్రంగా ఉన్నాయని ప్రశంసించారు. గ్రంథాలయం పైకప్పును దాతల సహాయంతో బాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పని తీరును చూసి సంతృప్తి చెందారు. గ్రంథాలయాధికారి వి.సూర్యనారాయణ మూర్తి (వి ఎస్ ఎస్ ఎన్ మూర్తి) వివరిస్తూ గ్రంథాలయములోని అన్ని విభాగాలు ప్రతి రోజు పరిశుభ్రంగా ఉంచుతున్నామని, పాఠకులకు కావలసిన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామని వివరించారు. ఇంకా దాతల సహాయంతో పది ఫైబర్ కుర్చీలను వితరణగా పొందడం జరిగినదని డైరెక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ I సునీల్ బాబు, ఎస్కే ఖయ్యూం అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, వి మనోజ్ బాబు కార్డు రైటర్, రాధమ్మ రికార్డు అసిస్టెంట్, భారతి లైబ్రేరియన్, ప్రతాప్ లైబ్రేరియన్, మనిగండన్ లైబ్రరీ హెల్పర్ పాల్గొన్నారు.
దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి
Related Posts
ఐఎంఏ స్టేట్ బెస్ట్ సెక్రెటరీగా డాక్టర్ బూసిరెడ్డి ..
SAKSHITHA NEWS ఐఎంఏ స్టేట్ బెస్ట్ సెక్రెటరీగా డాక్టర్ బూసిరెడ్డి … గుంటూరు బ్రాంచ్ కు మూడు పతకాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉత్తమ కార్యదర్శిగా సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత…
అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి
SAKSHITHA NEWS శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :ఈరోజు అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ SVN భట్టి ..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి ఎమ్. రత్న…