SAKSHITHA NEWS

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష దళిత బంధు పథకం పై చేసిన కామెంట్లను శేర్లింగంపల్లి ఎస్సీ సెల్ విభాగ నాయకులు 124 డివిజన్ కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మగళ్ళ మోసెస్ మాట్లాడుతూ లబ్ధిదారులకు పథకం అందట్లేదు అంటూ అబద్ధపు ప్రచారానికి పాల్పడుతున్న దళిత ద్రోహులకు చంపపెట్టుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆరెకెపూడి గాంధీ నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులకు పథకాన్ని అమలు జరిపి యూనిట్లు అందజేయడం జరిగిందని. ఎంక్వయిరీ చేయకుండా అధికారులను సంప్రదించకుండా కనీస అవగాహన లేకుండా బిజెపి నాయకులు మాట్లాడటం చూస్తుంటే దళిత బంధు పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 124 డివిజన్ ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలకు దళితులు బాగుపడడం మింగుడుపడడం లేదని.. 75 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ బిజెపి పార్టీలు దళితులను ఏనాడు పట్టించుకోలేదన్నారు. మోడీ గరీబోంకో హటావో అంటుంటే…. కేసీఆర్ గారు గరీబీ హటావ్ అనే సంకల్పంతో రాష్ట్ర జనాభా ప్రాతిపదికన మొట్టమొదటిగా పేద దళితులకు దళిత బంధు పథకం తీసుకొచ్చి వారి పేదరికాన్ని నిర్మూలించే గొప్ప ప్రయత్నం చేస్తుంటే.. పోటీ సమాజంలో దళితులు ఉండడం సహించలేని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పథకాన్ని ఆపేందుకు కుట్ర పన్నుతున్నారని.. భవిష్యత్తులో దళిత బంధు పథకానికి ఏ ఆటంకం జరిగినా.. బిజెపి కాంగ్రెస్ పార్టీలను దళితులు భూస్థాపితం చేసే రోజులొస్తాయి అని హెచ్చరించారు. ఇకనైనా దలితబందు పథకం పై కామెంట్లు చేయడం మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బిసి నాయకులు ఉద్యమకారులు రాములు గౌడ్, సిద్దయ్య, యాదగిరి, రవీందర్, ఇంత్యాజ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS