SAKSHITHA NEWS

సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు…

సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు దుండిగల్ తాండా-2లో మోల్డ్ టెక్ సంస్థ వారి సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కౌన్సిలర్ శంకర్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. తదనంతరం హెటేరో సంస్థ వారు 100 మంది విద్యార్థులకు బాగ్స్ మరియు యూనిఫాం, కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్ సహకారంతో టీవీ, నాయకులు ప్రవీణ్ నాయక్ సహకారంతో ఐడి కార్డులు, ప్రేమ్ సింగ్ ఆధ్వర్యంలో షూస్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ప్రభుత్వ సహకారంతో పాటు సీఎస్‌ఆర్‌ కింద పాఠశాలలకు పలు సంస్థలు చేయూతనివ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. మోల్డ్ టెక్ సంస్థ వారు పాఠశాల భవనం నిర్మించడం, శ్రియాస్ లైఫ్ సైన్సెస్ వారి సౌజన్యంతో ఫర్నిచర్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ఐటీ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, డిఈఓ విజయకుమారి, ఎంఈఓ ఆంజనేయులు, మోల్డ్ టెక్ సీఎండి జే.లక్ష్మణ్ రావు, డిఎండి ఏ.సుబ్రహ్మణ్యం, డిఎండి పి.వి.రావు, ఈడి ఎం.శ్రీనివాస్ మరియు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, సీఎస్ఆర్ ప్రొఫెషనల్ భీమ్ సింగ్ నాయక్, సీఎస్ఆర్ అడ్వైజర్ ప్రవీణ్ గడిల మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, జిహెచ్ఎంసి డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు, సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS