SAKSHITHA NEWS

తెలంగాణ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను గుర్తిస్తుంది

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల అందరికీ అందిస్తాం

. సాక్షిత : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుతోనే అన్ని సామాజిక వర్గాలను వెలుగులోకి తెచ్చింది

మాస్టిన్ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా

టిఆర్ఎస్ పార్టీ తోనే అన్ని అన్ని కులాల అభివృద్ధి సాధ్యం

మాస్టీన్ సామాజిక వర్గం నుండి తెరాస లో భారీగా చేరికలు

*ఘనంగా మాస్టీన్ కుల సంఘం ప్రమాణ స్వీకారం మహోత్సవంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ *

తెలంగాణ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను గుర్తిస్తుందని కోదాడ అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మాస్టీన్ కుల సంఘం ప్రమాణస్వీకారం మరియు పార్టీలో చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… గత పాలకవర్గాల కాలంలో వెనకబడిన జాతులు కులాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారె తప్పా వాళ్ల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వెనుకబడిన కులాల జాతుల మతాల వర్గాల వారిని గుర్తించి వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల్లో దేశానికి ఆదర్శంగా ఉంటూ నేడు అన్ని కులాలకు గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం తెరాస పార్టీ యొక్క లక్ష్యం అన్నారు.మాస్టీన్ సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. విద్యతోనే సామాజిక మార్పు వస్తుందని వెనకబడిన జాతులు కులాలు విద్యావంతులై రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలన్నారు. పేద కుటుంబంలో పుట్టిన నాకు పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మీ అందరికీ అండగా ఉంటారని ఆయన అన్నారు. మీ అందరికీ కుల సర్టిఫికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ నిండు ఆశీర్వాదం ఉండాలని అన్నారు.ఈ సందర్భంగా మాస్టీన్ కుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాస్టిన్ సంఘం నూతన కమిటీగా అధ్యక్షులుగా నాదెండ్ల చిరంజీవి, ఉపాధ్యక్షులు ఏసోబు, మహిళా అధ్యక్షురాలు పుల్లమ్మ, ప్రధాన కార్యదర్శి రాజు, మాల్సుర్, దర్శనం, కమిటీని ఎమ్మెల్యే సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితా రాధారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు వెంపటి మధుసూదన్, పట్టణ కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్,గుండెల సూర్యనారాయణ, ఖదీర్,లలిత, కోట మధు, మైస రమేష్, ఖాజా,కట్టేబోయిన శ్రీనివాస్, ఒంటిపులి శ్రీనివాస్, చింతల నాగేశ్వరావు, డాక్టర్ బ్రహ్మం, సాదిక్,మామిడి రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్, గ్రంథాలయ చైర్మన్ రహీం,మహిళా అధ్యక్షురాలు రోజా రమణి, టౌన్ పార్టీ ప్రచార కార్యదర్శి కాళిదాసు వెంకటరత్నం, టిఆర్ఎస్ నాయకులు బత్తుల ఉపేందర్, వార్డు అధ్యక్షులు మట్టపల్లి సలయ్య, సోమపంగు అవినాష్, చీమ సోమేశ్వరరావు, సోమగాని ఎల్లయ్య, నాగుల్, వంశీ, లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ నాయకులు కనగాల శ్రీధర్, కోదాటి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు
…….


SAKSHITHA NEWS