బౌరంపేట్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Sakshitha news

బౌరంపేట్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొని సర్వేపల్లి రాధకృష్ణ ఛత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించడం జరిగింది.

విద్యార్థులను ఉద్దేశించి కృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా భారత రాష్ట్రపతిగా సేవలు అందించిన వ్యక్తి ఆయన జన్మదినo సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు వచ్చినట్టు జన్మదినాలు వచ్చినట్టు ఉపాధ్యాయులకు కూడా వారి సేవలు గుర్తించి వారిని సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అన్నారు త్రిమూర్తుల స్వరూపమే శ్రీ గురు దత్తాత్రేయలు తల్లిదండ్రుల తర్వాత మనకు విద్య నేర్పించే ఉపాధ్యాయులే మనకు మన జీవితాల్లో వెలుగు నింపే గురువులు అని కొనియాడారు ఈ సందర్భంగా వారికి విద్యార్థుల చేతుల మీదుగా బట్టలు పెట్టి సత్కరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ రామ్ రెడ్డి గారు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు టీ శిల్ప క్రాంతి శ్రావణి జై ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు