చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అభివృద్ధికి ₹23.96 లక్షల CMC నిధులు మంజూరు

Sakshitha news

చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అభివృద్ధికి ₹23.96 లక్షల CMC నిధులు మంజూరు||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 277 డివిజన్ మహాదేవపురం లోని దేవేందర్ నగర్ లేఅవుట్ ల్యాండ్స్ పరిధిలో చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అభివృద్ధి కోసం ₹23.96 లక్షల CMC నిధులు మంజూరయ్యాయి.

ఈ అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానికంగా పిల్లలకు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా పార్క్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, dcc సెక్రెటరీ ఎండీ లయక్, గణేష్, జగన్నాథ్, దేవేందర్ నాథ్ (2BHK), శ్రీనివాస్ ప్రసాద్, ప్రభాకర్, సంగమేశ్, యాదగిరి, విజయ్, నాగరాజు, సత్యనారాయణ, రాజేష్, షాహెద్, సాజిద్, బ్రహ్మచారీ, శ్రీనివాస్ (వార్డ్ మెంబెర్), జహంగీర్, మైనారిటీ నాయకులు అఫ్జల్ భాయ్, అంజలి, కౌసల్య , తదితరులు పాల్గొన్నారు.