బడిబాట కార్యక్రమం విజయవంతం
సాక్షిత మోతె: మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమృత రెడ్డి, శ్రీధర్ రెడ్డి మొతె లాల్, శ్రీను,డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎలుగు మధు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు గ్రామంలోని పలు వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ప్రతి బాలబాలిక ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యను అభ్యసించాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో తల్లిదండ్రులు సహకరించాలని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం విద్య ఎంతో అవసరమని వారు మాట్లాడారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
