పార్టీ పట్ల అంకితభావం పేద ప్రజల పట్ల సేవా భావం ఉన్న వ్యక్తులనే రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిపించుకోవాలని టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండిరమేష్ పిలుపునిచ్చారు. అయన బుధవారం నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ ప్రకాష్ నగర్ లో స్థానిక నాయకులతో కలిసి సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. తన దృష్టికి వచ్చిన వాటర్ డ్రైనేజీ వంటి సమస్యలపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు .
డివిజన్ లు చిన్నవి కావడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయని అధికారులు అందుబాటులో ఉంటారని రమేష్ పేర్కొన్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు పట్ల ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని తద్వారా ప్రజల్లో సానుకూలత పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య ,రమేష్, బాలు, టోచర్ , జాన్,నర్సింగ్ రావు,రమాదేవి ,విశాల్, కరుణాకర్ ,భరత్, పర్వీజ్ ,సురేష్ ,అలీ ,అరుణ్, నరేష్, శ్రావణ్ , ముఫ్తీ అమర్, ఆలం, హఫీజ్ రహ్మతుల్, ఇమ్రాన్, అజీమ్, మునావర్, ఇర్షాద్, షారుక్, సికందర్, సోహలి ,ఇమితాజ్, హఫీజ్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
