SAKSHITHA NEWS

జాతరను విజయవంతం చేసేందుకు సహకరించాలని ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి కోరిన కట్టమైసమ్మ దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు…

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో సూరారం కట్ట మైసమ్మ దేవాలయ కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి జాతర విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ… చిత్తారమ్మ దేవి చల్లని దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ప్రతి యేడు అమ్మవారికి సేవ చేసేందుకు నాకు భాగ్యం కల్పిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ఆలయ కమిటీ సభ్యులు వీరారెడ్డి, ప్రసాద్, మల్లేష్, దారం సాయి, కృష్ణారెడ్డి, ఈ. సురేష్, ఇంద్రసేన, సాయి గౌడ్, మహేష్ కుమార్, శివరాజ్, వెంకటేష్, లక్ష్మారెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app