
మౌలిక వసతుల కల్పనలో కొంపల్లి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
కొంపల్లి మున్సిపాలిటీ లోని వివిధ వార్డులలో సుమారు 2.79 కోట్లా రూపాయలతో చేపట్టనున్న బీటి రోడ్డు, సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీరు నాల నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ సంక్షేమ నేత, అభివృద్ధి ప్రదాత , హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి మౌలిక వసతులను కల్పించామని రానున్న రోజుల్లో కూడా కొంపల్లి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు.
శంకుస్థాపన కార్యక్రమ వివరాలు…
1వ వార్డులలో 162 వ ఫ్లాట్ నుంచి శ్రీవాణి నిలయం ఫేస్ -2 వరకు సుమారు 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులు…
6వ వార్డులలో నూజివీడు సీడ్స్ (21.00 లక్షల రూపాయలతో) మరియు డిలైట్ హైట్స్ నుంచి సుప్రభాత్ ఆర్కేడ్ -3 వరకు (39.00 లక్షల రూపాయలతో) నిర్మించనున్న సీసీ రోడ్డు పనులు…
8వ వార్డులోని నాగార్జున కాంపౌండ్ వాల్ నుంచి నాని కుమారి ఇంటి వరకు (10 లక్షల రూపాయలతో), బృందావన్ రెసిడెన్సి నుండి వైజయంతి హోమ్స్ వరకు (20.00 లక్షల రూపాయలతో) చేపట్టనున్న సీసీ రోడ్డు పనులు….
8వ డివిజన్లోని బాలాజీ గ్రీన్ ల్యాండ్స్ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు 12 లక్షల రూపాయలతో చేపట్టనున్న ఎస్డబ్ల్యూజి డ్రైన్ పనులు…
ఎనిమిదవ డివిజన్లోని శ్రీ వేద అవెన్యూ నుంచి వైష్ణవి ఎంక్లేవ్ వరకు 16 లక్షల వ్యయంతో చేపట్టనున్న వర్షపు నీటి నాలా పనులు…
10వ వార్డులోని సాయి నిలయం నుంచి ఇందుమతి మార్ట్ వరకు సుమారు 19 వ్యయంతో చేపట్టనున్న ఎస్ డబ్ల్యూ జి పైప్లైన్ పనులు….
11వ వార్డులోని ఫార్మా హబ్ నుంచి ఏఎన్ఆర్ రెసిడెన్సి వరకు 11 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులు…
12వ వార్డులలో శ్రీ బాలాజీ కిరాణా స్టోర్స్ నుంచి శ్రీ గోవిందా ట్రేడర్స్ వరకు 15 లక్షల రూపాయలతో చేపట్టనున్న బిటి రోడ్డు పనులు…
13వ డివిజన్లోని మసీదు వద్ద సుమారు 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న ఎస్. డబ్ల్యూ.జి డ్రైన్ మరియు సిసి రోడ్డు పనులు…
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, మాజీ ఎంపీపీ సన్న కవితా శ్రీశైలం యాదవ్, కొంపల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు సన్న రవి యాదవ్, చింతల రవీందర్ యాదవ్ (సంజు), మంజుల కుమార్ గౌడ్, మేడంశెట్టి సువర్ణ, పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, తెల్ల కృష్ణవేణి వినోద్, శిరీష ప్రవీణ్, డప్పు కిరణ్, కో-ఆప్షన్ సభ్యులు వెంకటేష్, వార్డు అధ్యక్షులు, ప్యాక్స్ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు సంగీతా రెడ్డి, సీనియర్ నాయకులు చింతల దేవేందర్ యాదవ్, రాకేష్, మహేష్, సుధా, రఘునాథ్, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, కాలనీలవాసులు కిట్టు, సూర్యనారాయణ, రవిశంకర్, రామభద్రం, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, రవికుమార్, శివకుమార్, రాజ్ కుమార్, శారదా తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app