SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ నూతన సంక్షేమం సభ్యులు ….

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 132 – హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా ఈనెల 30వ తేదీన శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయంలో నిర్వహించనున్న వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. కాలనీవాసులందరూ ఐకమత్యం, సమిష్టి కృషితో పనిచేసినప్పుడు కాలనీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ నూతన అధ్యక్షులు కుంట సిద్ధిరాములు, ప్రధాన కార్యదర్శి తోకల నగేష్ రెడ్డి, గౌరవాధ్యక్షులు ఐ. ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రాజు, ఆలయ కమిటీ చైర్మన్ టి. రాజేశ్వర్, కోశాధికారి డి. బాల్ రాజ్, సభ్యులు మల్లేశం, గోపాల్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app