SAKSHITHA NEWS

హత్య కేసులు నిందితుడికి జీవిత ఖైదు 7000 జరిమానా జిల్లా కోర్టు విధింపు……..ఎస్పీ గిరిధర్ వెల్లడి
*
…..

సాక్షిత వనపర్తి :
భార్యను హత్య చేసిన నేరంలో నేరస్తునికి వనపర్తి జిల్లా కోర్టు నేరం రుజువు నిందితుడికి జీవిత ఖైదు తో పాటు 7000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ విలేకరులకు వెల్లడించారు
ఎస్పీ కేసు వివరాలను తెలియజేస్తూ వనపర్తి జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలకృష్ణ తండాకు చెందిన మూడవత్ భర్త గోపాల్ నాయక్ పెట్రోల్ పోసి 5- 11- 2020న నిప్పంటించి చంపడం జరిగిందని ఆత్మకూరు ఎస్సై ముత్తయ్య సి అర్ పి నెంబర్ 106/2020 అండర్ సెక్షన్ 302.498 (A) ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసి మృతురాలు మరణవాంగుమూలం మేరకు విచారణ జరిపి సాక్షాదారాలను కోర్టుకు సమర్పించడంతో నేరం రుజువైనందున వనపర్తి జిల్లా న్యాయమూర్తి ఆర్ సునీత నిందితుడికి జీవిత ఖైదు 7వేల జరిమానాను విధించినట్లు తెలిపారు నేరం చేసిన ఏ ఒక్కరూ శిక్ష నుండి తప్పించుకోలేరని దీని బట్టి రుజువు అవుతుందని తెలియజేస్తూ న్యాయ నిరూపణ జరపడంలో శిక్ష పడేందుకు కృషిచేసిన పోలీస్ అధికారులకు కోర్టు లాయర్లకు అభినందనలు తెలియజేస్తూ త్వరలో వారికి రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు


SAKSHITHA NEWS