జెన్ మాక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
•రైతును సన్మానించిన జన్ మాక్స్ కంపెనీ వారు
…..
కమలాపూర్ సాక్షిత :
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని కానిపర్తి గ్రామానికి చెందిన తొగరి నవీన్S/o.రాజయ్య అనే రైతు జెన్ మాక్స్ కంపెనీకి చెందిన సన్న రకం( జి× వి 2412) వరి పంటను తన పొలంలో వేసి ఎలాంటి పెస్టిసైడ్స్ మందులు వాడకుండా అధిక దిగుబడిని సాధించాడు. ఈ సందర్భంగా , జెన్ మాక్స్ కంపెనీ వారు తొగరి నవీన్ ను ఉత్తమ రైతుగా సన్మానించారు. అనంతరం తొగరి నవీన్ మాట్లాడుతూ జన్ మార్క్స్ కంపెనీ జి× వి 2412 అనే సన్నరకం వరి పంట 140 రోజులలో పంట చేతిలోకి వస్తుందని దీనికి ఎక్కువగా పెస్టిసైడ్స్ మందులు వాడనవసరం లేదని ఎకరానా 10 కిలోల యూరియా ,10 కిలోల పొటాష్, 10 కిలోల డిఏపి, వాడాలని పెస్టిసైడ్స్ మందులు వాడవలసిన అవసరం లేదని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుమతి వస్తుందని రైతులకు వరి వంగడాలను వివరిస్తూ రైతులందరూ జన్ మార్క్స్ కంపెనీకి చెందిన సన్నారకం వరి పంటను వేసి అధిక లాభాలను పొందాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు తొగరి కిషన్, దాసరి సదానందం, తొగరి కుమార్, జనగాని రామకృష్ణ, యాలాల ఎల్లస్వామి, దెబ్బెట కిషోర్, జనగాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.