SAKSHITHA NEWS

తిరుమల కాలినడక భక్తులు జాగ్రత్తలు పాటించాలి

తిరుపతి :
తిరుమలకు కాలి నడకన వచ్చిన భక్తుల్లో కొందరు అస్వస్థతకు గురవుతున్నా రు. అటువంటి వారికి టిటిడి తాజాగా పలు సూచనలు చేసింది.

వృద్ధులు, మధుమేహం, BP, ఉబ్బసం, మూర్చ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదు. రోజు వారి మందులు వెంట తెచ్చుకోవాలి.

అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చు. ‘తిరుమల లోని ఆశ్వినీ ఆస్పత్రి, తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం కల్పిస్తున్నాం’ అని టీటీడీ అధికారులు తెలిపారు..


SAKSHITHA NEWS