తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం
సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీ భోగ శశిధర్ మరియు సెక్రెటరీ జనరల్ గంగుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం జిల్లాలోని ఇరిగేషన్ కార్యాలయ సమావేశ మందిరంలొ ఈ రోజు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో ఉద్యోగుల పాలిటి శాపం గా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి నిరసనగా సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ, నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం నుండి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి తహసీల్ చౌరాస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన చేయాలని కమిటీ నిర్ణయించినది.
ఈ ర్యాలీలో జేఏసీ భాగస్వామ్య సంఘ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కనీ విని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో TNGO జిల్లా కార్యదర్షి మిర్యాల నాగేందర్ రెడ్డి, TGO జిల్లా కార్యదర్షి మామిడి రమేష్, పెన్షనర్స్ సంఘం జిల్లా అద్యక్షులు హరి అశోక్ కుమార్, నల్గవ తరగతి సంఘ అద్యక్షులు చంద్రయ్య, CPSEU అధ్యక్షులు గంగాధరి మహేష్, సర్వ సతీష్, మ్యాన పవన్, మహేష్, నాయకులు రవి బాబు, డా. రాజేందర్ రెడ్డి, రవిందర్, మధుకర్, గణేష్, ఉపాధ్యాయ సంఘ నాయకులు మచ్చ శంకర్, గంగనర్సయ్య, భోగ రమేష్, మల్లా రెడ్డి, తుంగూరి సురేష్, శ్రీనివాస్ గౌడ్, హరికిరణ్, డా.శ్రీనివాస్, డా.సంతోష్, శ్రీనివాస్, పూర్ణచందర్, ఆనంద్, రాజ్కుమార్, అశోక్ కుమార్, ముజాహిద్ ఖాన్, సంతోష్
నసీరుద్దీన్ మరియు తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామ్య సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.