జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ అధికారిని ఆదేశించిన…………జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సాక్షిత వనపర్తి ఆగస్టు 29
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల సిబ్బందిని పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటే ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు. రిజర్వేషన్ల కేటాయింపు పూర్తి అవ్వగానే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అందువల్ల అందుకు అవసరమైన కసరత్తు పకడ్బందీగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్లను సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పంచాయతీ రాజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అసెంబ్లీ ఓటరు జాబితా గ్రామ పంచాయతీ ల వారీగా, వార్డుల వారీగా తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇందుకు ముందుగా మ్యాపింగ్ చేసుకొని గ్రామంలోని ఓటర్లు అందరూ వారి వార్డుల వారీగా ఉండేవిధంగా చేసుకోవాలన్నారు. పంచాయతీ సెక్రటరీ, బి.ఎల్. ఒ ల సహకారంతో జాబితా సిద్ధం చేయాలని, పోలింగ్ స్టేషన్ లను గుర్తించి వాటికి అవసరమైన మౌలిక వసతులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది, ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించడం జరుగుతుందనీ, ఎన్నికలను నిష్పాక్షికంగా సజావుగా పూర్తి చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ డిపిఓ రమణ మూర్తి, జడ్పి సీఈఓ యాదయ్య, పిడి డిఆర్డిఏ పి. ఉమాదేవి, డి ఎల్.పి ఓ రఘునాథ్, డిప్యూటీ సీఈఓ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.