SAKSHITHA NEWS

సొంత నియోజకవర్గంలో గుర్తింపు కోల్పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తన సొంత నియోజకవర్గానికి చెందిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గుర్తింపు కోల్పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో తన అనుచరులను సభ్యులుగా నియమించాలని పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ

అయితే ఎమ్మెల్యే తన మనుషులతో ఏఎంసీలను నింపాలని మంత్రిపై, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.

బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే పార్టీకి ముఖ్యమని తనకి కావల్సింది చేయడానికి పార్టీ నాయకత్వం ఆసక్తిగా ఉందని ఎమ్మెల్సీకి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ స్పష్టం చేశారు.

దీంతో ఆ ఎమ్మెల్సీ ఏమి చేయలేక తన బాధను కాంగ్రెస్ నాయకుడు జానా రెడ్డికి చెప్పుకున్నటు సమాచారం.


SAKSHITHA NEWS