ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ….
సాక్షిత : నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో మందులు అందజేసిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ….డిజిటల్ మీడియా ఛానల్ లోగో ఆవిష్కరణ
130- సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ శ్రీ కళ్యాణ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ జన్మదినం పురస్కరించుకొని నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు “నా టీవి డిజిటల్ చానల్” లోగోను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ఆవిష్కరించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ సామాన్యులకు కార్పోరేట్ వైద్యసేవలు అందించడంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ప్రజలకు, ప్రజా సేవకులైన మాకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారంలో “నా టీవీ” మనందరి టీవీగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాంచంద్రారెడ్డి, నందగోపాల్, వెంకటేష్, గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సలహాదారుడు రమేష్ సర్వేపల్లి గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు సుబ్రమణ్య స్వామి హరి రాఘవేంద్ర శ్రీధరాచార్యులు సురేష్ శర్మ, హనుమంతరాయ శర్మతో పాటు సియంఆర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రియాజ్, డాక్టర్ సుమ కోఆర్డినేటర్ రాజ్ నారాయణ్ ప్రభృతులు పాల్గొన్నారు