SAKSHITHA NEWS

లక్షలాదిమంది ఆకలి తీరుస్తున్న…..హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ సేవలు ఎనలేనివి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులతో భేటీ అయిన ఎమ్మెల్యే రాము

గుడివాడలో హరే కృష్ణ మూమెంట్ వంటశాల నిర్మాణానికి సహకరిస్తా…..

గుడివాడ : గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఏపీ ప్రతినిధులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా గుడివాడ ప్రాంతంలో ఉన్న అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న సేవలను ఫౌండేషన్ ఏపీ వైస్ చైర్మన్ విలాస్ విగ్రహ దాస,రఘునందన దాస ఎమ్మెల్యే రాముకు వివరించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫౌండేషన్ వంటశాలల ద్వారా అందిస్తున్న శుచికరమైన ఆహార పదార్థాలు తయారీ విధానాన్ని….. ఛాయాచిత్రాల ద్వారా ఫౌండేషన్ సభ్యులు ఎమ్మెల్యే రాము చూపించారు.

గుడివాడలో ఫౌండేషన్ వంటశాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని విలాస్ విగ్రహ దాస,రఘునందన దాస ఎమ్మెల్యే రామకు విజ్ఞప్తి చేశారు….. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే రాము సానుకూలంగా స్పందించారు.

గుడివాడలో అవకాశం ఉన్నచోట హరే కృష్ణ మూమెంట్ వంటశాల నిర్మాణానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ఎమ్మెల్యే రాము తెలియచేశారు.మనిషిలో ఆలోచన శక్తిని పెంపొందించేలా అక్షయపాత్ర మరియు హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ ద్వారా నిత్యం లక్షలాదిమందికి శుచికరమైన ఆహారాన్ని అందిస్తూ చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు.

అంత గొప్ప సంస్థ గుడివాడలో వంటశాల ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాను అన్ని విధాలుగా సహకరిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే రాము కృష్ణ భగవాన్ ని ఫోటో చిత్రం, భగవద్గీతను ఫౌండేషన్ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS