కాటమయ్య స్ఫూర్తితో కల్లుగీత వృత్తిలో ఉపాధికై ఉద్యమిస్తాం.
మేకపోతుల వెంకటరమణ,KGKS రాష్ట్ర అధ్యక్షులు.
సాక్షిత : నాడు నరరూప రాక్షసులను సంహరించి తాటి ఈత వనాన్ని కాపాడిన కాటమయ్య స్ఫూర్తితో నేడు వన సంరక్షణకై ఉద్యమిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ అన్నారు.
ఆగస్టు 2 న ప్రారంభమైన అమరుల యాధిలో గీతన్నల చైతన్య యాత్రలో భాగంగా మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో యాది సభ జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు వి వెంకట నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా యం.వి. రమణ పాల్గొని ప్రసంగించారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి అమరులైన నాయకులందరినీ యాది చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు చేస్తున్నామని ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతి నాడు ముగిస్తామన్నారు.
భూములకు ధరలు పెరగడంతో యజమానులు తాటి ఈత చెట్లను నరికి వేస్తున్నారని దీనివలన గీత కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు పర్యావరణం దెబ్బతింటుందన్నారు. చెట్లను తొలగించడం చట్ట ప్రకారం నేరం అన్నారు.
ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలనె 560 జీవో అమలు చేయాలని, ప్రభుత్వ భూమి లేనట్లయితే కొని ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వృత్తిలో ప్రమాద నివారణకు కాటమయ్య రక్షణ కవచం పేరిట రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ కిట్టులు ఇవ్వడం అభినందనీయం అన్నారు. ఇవి వృత్తి చేసే వారందరికీ ఇవ్వాలని సూచించారు. గీత కార్మికులకు కేటాయించిన బడ్జెట్ తో నక్లెస్ రోడ్ లో నిర్మించిన నీరా కేఫ్ ను టూరిజం శాఖ నుండి తొలగించి టాడి కార్పొరేషన్ కి అప్పగించాలని తద్వారా గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆగస్టు 18 న సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గీత కార్మికులకు ప్రకటించిన హామీలన్నీ అమలు చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి కప్పల లింగం గౌడ్ మాట్లాడుతూ వృత్తి చేసే వారందరికీ సభ్యత్వము గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. సీనియర్ నాయకులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌడ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు చింతల మల్లేశం గౌడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు పార్టీలకతీతంగా ఐక్యంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జీడి బాలచందర్ గౌడ్, జీడి సంపత్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి కప్పల లింగం గౌడ్ అంబాల శ్రీనివాస్ గౌడ్ సట్ల ప్రభాకర్ గౌడ్ మేకపోతుల కృష్ణ గౌడ్ వేణుగోపాల్ గౌడ్ పంజాల యాదగిరి గౌడ్ రామకృష్ణ గౌడ్, జనగాని రాజు గౌడ్ నాతి మహేష్ గౌడ్ మెరుగు జంగయ్య గౌడ్, బూడిద కృష్ణ మూర్తి ఆ బూడిద కృష్ణమూర్తి బూడిద రాకేష్ గౌడ్ దొంతి అంజయ్య గౌడ్, దుమ్మడ శ్రీశైలం గౌడ్ దేశం అనిత గౌడ్ రాంపల్లి సుధా గౌడ్ బాల్నేని శ్రీలత గౌడ్ డి లక్ష్మణ్ గౌడ్ పి సుభాష్ గౌడ్ సుదగాని రమేష్ గౌడ్, ఆకుల రమేష్ గౌడ్ తోకల నరేందర్ గౌడ్ మరియు జిల్లా కల్లుగీత కార్మిక సంఘం కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.