స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమంలో భాగంగా బీరప్ప నగర్ లో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ ..
సాక్షిత : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాద్యతగా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి, జీడిమెట్ల డివిజన్, బీరప్ప నగర్ కాలనిలో డిప్యూటీ కమిషనర్ నర్సింహా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, బీరప్ప నగర్ కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు.
ప్రతి ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని, పచ్చదనాన్ని కాపాడాలని అన్నారు. కాలనీల్లో దోమల సమస్య లేకుండా చూడాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు మాజీ ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నర్సింహా , హెల్త్ ఆఫీసర్ డా. భార్గవ్ నారాయణ , కుత్బుల్లాపూర్ A-బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ , డివిజన్ అధ్యక్షులు బేకు శ్రీనివాస్ , బీరప్ప నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియషన్ అధ్యక్షులు క్రిష్ణా రెడ్డి , తిరుపతి, సంతోష్, వెంకటేష్, శ్రీనివాస్ రాజు, మంగయ్య, శానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.