SAKSHITHA NEWS

మహబూబాబాద్ జిల్లా…

ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల పట్ల విద్యార్థుల అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు వివరించాలని మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్ అన్నారు.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత రక్షణ, సైబర్‌ క్రెం, ఆన్‌లైన్‌ మోసాలు అంశాలపై ఈరోజు శ్రీచైతన్య పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు మహబూబాబాద్ టౌన్ ఎస్.ఐ అరుణ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… మహిళలకు విద్యార్థినిలకు రక్షణ కోసమే షీ టీం ఉన్నాయని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ అవేర్నెస్‌‌తో పాటు జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు, మహిళల భద్రత రక్షణ,100 డైల్ , సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాలు, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి వివరించారు. సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల పై, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థి, విద్యార్థినిలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ అరుణ, పోలీస్ సిబ్బంది అధ్యాపకులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 07 27 at 14.53.51

SAKSHITHA NEWS