kaushik మలాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కౌశిక్

SAKSHITHA NEWS

kaushik మలాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కౌశిక్

kaushik కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 1 )

kaushik కల్యాణ లక్ష్మి చెక్కల పంపిణి విషయమై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉన్న కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వకుండా అధికార పక్షం కట్టడి చేసింది.

స్వయంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే కు చెక్కులు ఇవ్వొద్దు.. మీరే చెక్కులు ఇవ్వండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ వాయిస్ రికార్డ్ కూడా లీక్ అయింది. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు. కౌశిక్ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ప్రభుత్వ జీవోలో ఉన్న ప్రకారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

75 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా అయన చాలా ఉద్వేగంగా ప్రసంగించారు

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వడం లేదని, ఈ పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారని, పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా కేసీఆర్ ఆదుకున్నారని, ఏదైనా కక్ష్య ఉంటే నా పై తీర్చుకోవాలి కానీ, నియోజకవర్గ ప్రజలపై కాదని, నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తానని అయన స్పష్టం చేసారు.

త్వరలోనే మిగిలిన హుజురాబాద్, కమలాపూర్ జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాలకు చెందిన లబ్దిదారులకు 400 కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కౌశిక్ స్థానిక ఆర్డీవోను ఆదేశించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్ కోర్టుకు వెళ్లి.. పట్టుబట్టి కల్యాణలక్ష్మి చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కౌశిక్ తన దృష్టిలో పడితే.. వదలదు.. ఎంతకైనా తెగిస్తాడు.. సాధించి తీరతాడు.. ఇది అయన నైజం.. మంత్రిని కూడా న్యాయపరంగా ఎదుర్కొని చెక్కులు ఇచ్చి తన పంతం నెగ్గించుకున్నారని కమలాపూర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నేత తక్కళ్లపెళ్లి సత్యనారాయణ రావు వ్యాఖ్యానించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

kaushik

SAKSHITHA NEWS

Related Posts

party పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కాదా

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSparty పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కాదా?: మేయర్ గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి, కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి రాజీనామా చేయా…

SAKSHITHA NEWS

raj tarun రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSraj tarun రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు TG: తనను మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్ లో నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు.అందుకు సంబంధించిన…

SAKSHITHA NEWS

You Missed

chaturmasa చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్

chaturmasa చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్

august ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు

august ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు

party పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కాదా

party పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కాదా

amarnath వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా

amarnath వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా

hathrus హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా

hathrus హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా

raj tarun రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు

raj tarun రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు

You cannot copy content of this page