KCR's emergency meeting with MLAs at the farm house.. What is the plan?
ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ.. ప్లాన్ ఏంటి?
హైదరాబాద్: బడాబడా నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోవడం.. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. మరికాసేపట్లోనే ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు..
హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట లభించింది. 2011లో తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో ఈ కేసు విచారణపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా 2011, అక్టోబర్‌లో నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రైలు రోకోకను పిలుపునిచ్చారంటూ మల్కాజ్‌గిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. అలాగే పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగుల విధులకు ఆయన ఆటంకం కలిగించినట్లు ఆ నివేదికలో స్పష్టం చేశారు. దీనిపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తాను ఎలాంటి రైలు రోకోను పిలుపు ఇవ్వలేదన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం మేరకు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు.
ఇక ఈ రైలు రోకో ఘటన చోటుచేసుకున్న మూడేళ్లకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి బలం ఉండని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అందులోభాగంగా తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేసీఆర్ తన వాదనను స్పష్టం చేశారు. దాంతో మంగళవారం వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసును జులై 18వ తేదీకి వాయిదా వేసింది..