SAKSHITHA NEWS

Prof. Jayashankar, the great leader who fought for the formation of Telangana state until his last breath

తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన మహానేత ప్రొ.జయశంకర్ : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్…
………………………………………………………………………………………
*సాక్షిత * : ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహాయోధుడు, తెలంగాణా జాతి పిత ప్రోపెసర్ జయశంకర్ సార్ అని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ అన్నారు. తెలంగాణా జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్బంగా నిజాంపేట్ లోని రాజీవ్ గృహకల్పలో గల ప్రొ.జయశంకర్ సార్ విగ్రహానికి, నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ తో తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. ఈ కార్యక్రమంలో 31&33వ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బిక్షపతి, ముత్యాలు, నాయకులు దశరథ్, స్థానిక నాయకులు ఖలీల్, చుక్క వెంకటేష్, శ్రీను, తొంటా చందు, స్థానిక నాయకురాలు నర్మదా, స్వర్ణ కుమారి, సరస్వతి, మంజుల, వెంకటమ్మ, అన్నపూర్ణ, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2024 06 21 at 11.52.37

SAKSHITHA NEWS