SAKSHITHA NEWS

హైదరాబాద్:
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించను న్నట్లు సమాచారం.

అలాగే రాష్ట్ర విభజన చట్టం లోని పెండింగ్ అంశాలు, ఏపీతో ఉన్న సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశాలపై నివేదిక తయారుచేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.

కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించా లని ముఖ్యమంత్రి నిర్ణయిం చారు.

జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవు తుంది. స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్య మంత్రి నిర్ణయించారు.

విద్యార్థుల నమోదు,పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు…

WhatsApp Image 2024 05 17 at 16.18.50

SAKSHITHA NEWS