ఖమ్మం జిల్లాకు ఝార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖల డైరెక్టర్
ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
ఝార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖల డైరెక్టర్ కుమార్ తారాచంద్ నేతృత్వంలోని బృందం తెలంగాణ రాష్ట్రంలో సాగు బాగు ప్రాజెక్ట్ అధ్యయన నిమిత్తం పర్యటిస్తున్నది. పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాకు చేరుకున్న బృందం, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో కలిసినారు. ఈ సందర్భముగా వ్యవసాయ, ఉద్యానవన రంగంలో చేపడుతున్న చర్యలు, సాగు బాగు ప్రాజెక్ట్ అమలు గురించి బృందానికి కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో బృందంలోని అధికారులు ఝార్ఖండ్ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి, సలహాదారు ప్రదీప్ కుమార్ హజారే, ఝార్ఖండ్ రాష్ట్ర కార్యదర్శి ఓ.ఎస్.డి. అభినవ్ మిశ్రా, ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, డిజిటల్ గ్రీన్ ప్రాజెక్ట్ మేనేజర్లు జ్యోతి, యశోద, అధికారులు తదితరులు పాల్గొన్నారు.