అమరావతి:
ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గ దర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయా లకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని సర్కార్ నిర్ణయిం చింది.
బ్యాంక్ ఎకౌంట్ లేనివారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమ స్యలు ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మే ఒకటి నుండి 5వ తేదీ లోపు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేస్తున్నారు.
పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారు లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాల తో విధివిధానాల్లో ప్రభు త్వం మార్పులు చేసింది…