మళ్లీ వచ్చేది వైసిపి ప్రభుత్వమే…

Spread the love

బొల్లాపల్లి మండలం ఎన్నికల ప్రచారం లో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు *
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం చెంచుగుంట తండా, లింగంగుంట తండా, గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, పాపాయిపాలెం, వీరపుకుంట తండా, మేకలదిన్నే తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .

గ్రామాలలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రతి ఒక్కరినీ పలకిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి చెందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, రానున్న కాలంలో కూడా ప్రజలకు ప్రభుత్వం తరపున చేసే మేలును తెలియజేస్తూ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి అభివృద్ధి, సంక్షేమ కు సహారించాలని కోరారు..

Related Posts

You cannot copy content of this page