జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని సండ్రాల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి జాతీయ బాబు జగజ్జీవన్ రాం ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షులు దాసరి స్వప్న, మహేష్ లు సోమవారము ఆన్ లైన్ లో ఏనుగు ఆదిరెడ్డి కి అవార్డు తో కూడిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు.పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన మహనీయుల పుట్టిన రోజు వేడుకలు జరుపడం, అలాగే సమాజ సేవ చేయడం, తదితర అంశాలపై ఆదిరెడ్డి కృషి చేసినందుకు దేశ నాలుగవ డిప్యూటీ ప్రధాన మంత్రి బాబు జగజ్జీవన్ రాం పేరు మీద, జాతీయ బాబు జగజ్జీవన్ రాం ఎక్సలేన్స్ అవార్డ్ వారికి పంపినట్లు దాసరి స్వప్న, మహేష్ తెలిపారు. అవార్డ్ అందుకున్న ఆదిరెడ్డినీ ఉపాద్యాయులు,మిత్రులు,విద్యార్థులు అభినందించారు.
జాతీయ బాబు జగజ్జీవన్ రాం అవార్డు అందుకున్న ఆదిరెడ్డి
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…