SAKSHITHA NEWS

సీసీ టీవీ ఫుటేజ్‌లో సంచలన దృశ్యాలు

విశాఖపట్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు విధుల్లో ఉండగానే గన్‌తో పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఐదు గంటల షిఫ్ట్ డ్యూటీకి హాజరైన శంకర్రావు ఏడు గంటల సమయంలో తన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ హృదయ విదారక దృశ్యాలు నిజం న్యూస్ సంపాదించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు చెస్ట్‌కు గన్‌మెన్‌గా శంకర్రావు విధులు నిర్వర్తిస్తున్నారు. శంకర్రావుకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ విషాద ఘటన ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అవేదన కలిగించిన ఆత్మహత్య దృశ్యాలు

ఎస్‌పీ‌ఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య దృశ్యాలు ఆవేదన కలిగించాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెస్ట్ గార్డ్ గా ఉంటున్న శంకర్రావు తన వద్ద ఉన్న ఎస్ ఎల్ ఆర్ గన్‌తో తానే స్వయంగా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శంకర్రావు ఆత్మహత్య చేసుకునే సమయంలో విధుల్లో నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. మిగతా ముగ్గురూ అక్కడ లేని సమయంలో ఎస్ ఎల్ ఆర్ గన్ తో ఎలా కాల్చుకోవాలో ముందుగా పరిక్షించుకున్నారు శంకర్రావు. చివరకు చాతీకి ఎస్ ఎల్ ఆర్ గన్ పెట్టీ ముందుకు వంగి మరీ కాల్చేసుకున్నారు శంకర్రావు. కాల్చుకునే ముందు “భగవంతుడా” అంటూ ట్రిగ్గర్ నొక్కుకున్న దృశ్యాలు అంతులేని ఆవేదనను కలిగించాయి. కాల్చుకున్న 13 సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు శంకర్రావు. ఆ గన్ శబ్దం విని హుటాహుటిన లోనికి వచ్చారు మిగతా ముగ్గురు కానిస్టేబుళ్లు. మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఆత్మహత్య కు గల కారణాలపై దర్యాప్తు

ఎస్ పీ ఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్యపై ఏసీపీ రాంబాబు స్పందించారు. ఉదయం ఐదు నుంచి ఏడు గంటల డ్యూటీకి వచ్చి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, శంకర్రావు నైట్ డ్యూటీ కూడా చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య కు కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ రాంబాబు చెప్పారు. చాతిలో గన్ పెట్టి తానే కాల్చుకున్నాడన్న శంకర్రావు బుల్లెట్ ఎంట్రీ, లోపల నుండి బయటకు వెళ్లడం వల్ల మరణించినట్టు తెలిపారు. శంకర్రావుకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. శంకర్రావు సొంతూరు శ్రీకాకుళం జిల్లా రాజాం అని రాంబాబు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరపుతున్నట్లు వెల్లడించారు పోలీసులు.

WhatsApp Image 2024 04 11 at 6.17.10 PM

SAKSHITHA NEWS