జన జాతర కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేవెళ్ల నియోజకవర్గం ప్రజానీకానికి శంకర్పల్లి మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భీమ్ భరతన్న మాటకు మరియు ఎంపీ అభ్యర్థిరంజిత్ రెడ్డి మాటకు కట్టుబడి ఇసుకేస్తే రాలనంత మంది చేవెళ్ల నియోజకవర్గం నుంచి వచ్చినందుకు శంకర్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం కృష్ణారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేస్తే తరువాత పదేళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లు రాకుండా చేసి రంగారెడ్డి జిల్లా అదే విధంగా చేవెళ్ల నియోజకవర్గం రైతులకు కన్నీటి గాధ మిగిల్చిన కెసిఆర్ కి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ఎట్టి పరిస్థితులలో వేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ 6 గ్యారంటీ పథకాలతో పాటు ప్రతి ఒక్క పేద ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల, ప్రజలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న ప్రజలు 14 ఎంపీ సీట్లు గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి కి మరియు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియమ్మకు మరియు రాహుల్ గాంధీ కి కానుకగా ఇవ్వాలని బద్దం కృష్ణ రెడ్డి కోరుకోరారు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చి భీమ్ భరతన్న నాయకత్వాన్ని బలపరచాలని శంకర్పల్లి మున్సిపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం కృష్ణారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మాజీ సర్పంచ్ బిసోల శ్రీధర్, మాజీ ఎంపీటీసీ ఇజాజ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధ గోని శ్రీనివాస్ గౌడ్, దుర్గం వెంకటేష్, శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు