పోలీస్ కమిషనర్ సునీల్ దత్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
ట్రైనీ కానిస్టేబుళ్ల వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు తొమ్మిది నెలల శిక్షణ చాల కీలకమైనదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. శిక్షణలో భాగంగా ఫైరింగ్ రేంజ్ నందు సిబ్బందికి ఇస్తున్న ఫైరింగ్ ప్రాక్టీస్ శిక్షణను పోలీస్ కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు మీరంతా సుదీర్ఘ కాలంపాటు సగర్వంగా అందించబోయే సేవలకు శిక్షణ చాల కీలకమైనదని అన్నారు.
ఇందుకోసం కావల్సిన శక్తి సామర్థ్యాలను, నిబద్ధతను శిక్షణలో మేము మీకు నేర్పిస్తామని, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అంకితభావంతో ముందుకు వెళ్తూ..పోలీసు శాఖకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని విశ్వసిస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపి గణేష్, ఏసీపీ రవి, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ ఐ లు తిరుపతి, అప్పలనాయుడు, నాగులమీరా పాల్గొన్నారు.