ప్రజా సమస్యల పరిష్కారాలే ఎజెండా గా పనిచేద్దాం

Spread the love

నడిగడ్డ అభివృద్ధి మార్పుకై మడమ తిప్పని పోరాటం చేద్దాం

అసెంబ్లీ ఎన్నికలలో నిజాయితీగా ఓట్లు వేసిన వారందరికీ ధన్యవాదములు

— పార్లమెంట్ సన్నాహక సమావేశంలో గొంగళ్ళ రంజిత్ కుమార్


నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంటు సన్నాహాక సమావేశంలో గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ…

నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఈ ప్రాంతంలో పేద వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలబడుతూ, బలమైన బహుజన వాదాన్ని వినిపిస్తూ,ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమం కోసం పోరాటం చేసిందని, రాబోయే రోజుల్లో కూడా ప్రజా పోరాటాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని అన్నారు. మొదటినుండి ఈ ప్రాంతంలో రైతుల సమస్యలతో పాటూ,విద్యా,వైద్య అభివృద్ధి కోసమై పాలకులను ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు. అనేకమంది అనేక రకాలుగా అపోహలను సృష్టించిన ఎక్కడా వెనుకడుగు వేయకుండగా నిబద్ధతతో పోరాటం చేశామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు మనోధైర్యంతో ప్రజా సమస్యల పోరాటంకై నడుం బిగించాలని అన్నారు.

జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులను పరిశీలించి ఎవరైతే మన ప్రాంత అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించే నిబద్ధతగల నాయకత్వానికి మద్దతు ఇద్దామని అన్నారు.
కొంతమంది కొన్ని రకాల అపోహాలను సృష్టిస్తున్నారని వాటిని నమ్మాల్సిన పనిలేదని ఈ ప్రాంతంలో నిజాయితీగా పని చేస్తున్న మనలను ప్రశ్నించే హక్కు వారికి లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా కమిటీ నాయకులు  లవన్న,పరుష రాముడు,వెంకట్ రాములు,రంగస్వామి అలంపూర్ సమన్వయకర్త నగేష్ యాదవ్,శ్రీనివాస్ యాదవ్,విజయ్,గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు, దరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు,మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు,మండలాల నాయకులు తిమ్మప్ప, లక్ష్మన్న, ప్రేమ్ రాజ్,మునెప్ప, రాము,మల్దకల్,అడవి ఆంజనేయులు, ఇస్మాయిల్,వెంకన్న,వన్నప్ప,భీమనగౌడ్, యేసు,దస్తగిరి గౌడ్,జ్ఞానేశ్వర్, జగన్నాథ్,విజయ్,కృష్ణ, గుండన్న,ఉప్పరి కృష్ణ, అంజి,గోపాల్, ఆయా గ్రామ కమిటీల అధ్యక్షులు మండల కమిటీల నాయకులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page