తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి క్యాంపు కార్యాలయంలో దివ్యాoగులకు ఉపకరణాల అందజేతలో భాగంగా 12 మందికి వాహనాలు అందజేశారు. ఒక్కో వాహనం రూ. 1,17,500 ల చొప్పున రూ. 14,10,000 విలువచేసే 12 వాహనాలు దివ్యాoగులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దివ్యాoగులను పేరు పేరునా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. మిగిలిన వారందరికి ఉపకరణాలు అందిస్తానని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, ఏసీపీ తిరుపతి రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.