తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు,టీడీపీ నాయకులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉండే ఉండవల్లి కరకట్ట వెంబడి
కొంతమంది వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కి చెందిన అనుచరులు చంద్రబాబు లోకేష్ తో ఉన్న ఫ్లెక్సీలను ఇష్టం వచ్చినట్లు కర్రలతో కరకట్టకు ఇరువైపులా వున్న టీడీపీ బ్యానర్లను చంద్రబాబు,లోకేష్‌ల ఫ్లెక్సీలుబ్యానర్లను చించివేయడంతో పాటు రాళ్లు తీసుకుని కొట్టడం దుర్మార్గమైన చర్యని టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఖండించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.ఫ్లెక్సీలు ఇష్టం వచ్చినట్లు రాళ్లతో కర్రలతో కొట్టి చించి వేయడంపై పిరికిపంద చర్య అని వండిపడ్డారు. ఇటువంటివి చర్యలు మంచివి కావని అన్నారు.తక్షణమే ఫ్లెక్సీలు చించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదివారం సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో
టిడిపి నేతలతో కలసి వెంకట్రావు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దారా దాసు,ఓలేటి రాము,ఇట్టాభాస్కర్,ఇట్టా పెంచలయ్య,మేకా పుల్లారెడ్డి,అద్దంకి మురళి,జుంజు మరియదాసు,బెజ్జం రామకృష్ణ,కె.మహా లక్ష్మి,అన్నెం కుసుమ,బుదాల రవికుమార్,చాంద్ భాషా,తదితరులు పాల్గొన్నారు.