SAKSHITHA NEWS

భారత వీరత్వానికి ప్రతీక.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపచేసిన యోధుడు.. యువతరానికి ఎప్పటికీ పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.