వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో చేర్చాలి.
ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం, బహుజన సమాజ్ పార్టీ డిమాండ్
వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో చేర్చాలని ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శీలం శ్రీనివాస్. బిఎస్పి పార్టీ తాలూకా ఇంచార్జ్ లింగాల. స్వాములు. మాల మహానాడు నాయకులు అంకన్న లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ప్రభుత్వం సకలాంగులకు ఇచ్చినట్లే 3000 రూపాయలు పెన్షన్ మాత్రమే ఇస్తూ చేతుల దులుపుకుంటుందని వీటిని 6000 రూపాయలకు పెంచి వారి ఆదుకోవాలని వారన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించాలని, వివాహ ప్రోత్సాహక బహుమతి రెండు లక్షలు రూపాయలు పెంచాలని 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పట్టిష్ట పరచాలని దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో చేర్చి వికలాంగుల ఆదుకోవాలని లేదంటే దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు ప్రజాసంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో ముద్రగడ శ్రీనివాస్ రావు ,దానమ్మ, కళావతి శీలం లింగమయ్య,తెలుగు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో చేర్చాలి.
Related Posts
అధికారం ఉంది కదా అని ఒక వ్యవస్థను నాశనం
SAKSHITHA NEWS అధికారం ఉంది కదా అని ఒక వ్యవస్థను నాశనం చేయాలని చూసి బొక్క బోర్లా పడి అదే వ్యవస్థను పర్యవేక్షించే పరిస్థితికి వచ్చిన ఒక అధికారి!! కట్టెలు అమ్మిన చోటే కట్టెలు కొట్టుకునే పరిస్థితి!! పేదలకు గుప్పెడు అన్నం…
25న వాయుగుండం.
SAKSHITHA NEWS 25న వాయుగుండం. ఏపీలో దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్యదిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్ప పీడనంగా…