కంచికచర్ల పట్టణంలో రూ.1.04 కోట్లతో పూర్తి చేసుకున్న 33 KV విద్యుత్తు లైన్ షిఫ్టింగ్ ను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
కంచికచర్ల పట్టణంలో జిల్లా పరిషత్ నిధులు రూ.30 లక్షలతో అంబేద్కర్ కాలనీలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని ..
కంచికచర్లలో అరుంధతి కాలనీలో జిల్లా పరిషత్ నిధులు రూ.40 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
కంచికచర్లలో 33 కె.వి హై టెన్షన్ వైర్ల షిఫ్టింగ్ పనులకు ప్రత్యేక నిధులను మంజూరు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
కంచికచర్లలో పలు కాలనీల గుండా హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఇళ్ళ మీద నుండి ప్రవహిస్తూవుడటంతో.. విద్యుత్ షాక్ గురై 6 గురు మృత్యువాత పడ్డారు.. దాదాపు 40 సంవత్సరాలుగా గత పాలకులు ప్రజల ఇబ్బందులను పట్టించుకున్న పాపాన పోలేదు ..
2019 ఎన్నికల ముందు కంచికచర్లలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి రాగానే విద్యుత్ వైర్ల సమస్యను పరిష్కరించాం.. 4 దశాబ్దాల సమస్యను పరిష్కరించినందుకు సంతృప్తిగా ఉంది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
హై టెన్షన్ విద్యుత్ వైర్ల షిఫ్టింగ్ లో ఎంతగానో శ్రమించిన విద్యుత్ శాఖ సీఎండి, డీఈ, ఏఈ, ఇతర విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు.. నేటి నుండి పాత వైర్లలో విద్యుత్ సరఫరాను నిలిపివేశాం.. అతి త్వరలోనే ఆ వైర్లను, స్తంభాలను కూడా తొలగిస్తాం ..
ప్రజల పట్ల నిబద్ధతతో.. బాధ్యతతో పనిచేస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పనితీరు ప్రశంసనీయం.. మంచి చేసే వారికే ప్రజల అవకాశం ఇవ్వాలి : MP కేశినేని నాని ..
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కంచికచర్ల పట్టణ అభివృద్ధి.. త్వరలో కంచికచర్లను మరింత అభివృద్ధి చేస్తాం.. గత పాలకులకు – నేటి పాలకులకు గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
అనంతరం MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని, MP కేశినేని నాని ని ఘనంగా కంచికచర్ల కాలనీవాసులు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ..
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు ..