SAKSHITHA NEWS

  • క్రీడా పోటీలు నైపుణ్యాలను పెంచుతాయి… జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్.

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో క్రీడా ప్రాంగణంలో శుక్రవారం స్కూల్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది.తొలుత పాఠశాల విద్యార్థులు ఫ్లాగులతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరిని ఆకట్టుకుంది. ముఖ్య అతిథి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య లు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన క్రీడా సంబురం ప్రారంభ సభలో ముఖ్య అతిథి లింగాల కమల్ రాజ్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ క్రీడా పోటీలు విద్యార్థులలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీస్తాయన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి వారు ఉన్నతంగా ఎదిగేలా దోహదపడతాయన్నారు. ప్రతి పోటీలో విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పాల్గొని బహుమతులు సొంతం చేసుకోవాలని కోరారు.స్మార్ట్ కిడ్జ్ లో విద్యార్థులను చదువుతోపాటు క్రీడా, సాంస్కృతిక, వైజ్ఞానిక అంశాల్లో ప్రోత్సహించడం అభినందనీయం అని కమల్ రాజ్ తెలిపారు.

పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పాఠశాలకు సంపూర్ణ సహకారాన్ని అందించడం అభినందనీయమని వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతి ప్రతిభను అన్ని అంశాల్లో వెలికితీయడానికి తమ పాఠశాల నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య , ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్య అతిధి లింగాల కమల్ రాజ్ జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులకు కబడ్డీ, కోకో, హార్దిల్స్, టెన్నికాయిడ్, అథ్లెటిక్స్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ తదితర పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథి లింగాల కమల్ రాజును పాఠశాల యాజమాన్యం శాలువా, జ్ఞాపకలతో ఘనంగా సత్కరించారు.


SAKSHITHA NEWS