SAKSHITHA NEWS

సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.. లేదంటే తగిన పర్యవసానాలు తప్పవు: సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సౌత్ చైర్ పర్సన్ శాలిని జాదవ్


సాక్షిత శంకర్‌పల్లి: సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.. లేదంటే తగిన పర్యవసానాలు తప్పవని సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సౌత్ చైర్ పర్సన్ శాలిని జాదవ్ అన్నారు. ఉప్పల్ పరిధి హబ్సిగూడ లోని ఒమేగా డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థినులకు సోషల్ మీడియా, క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం శాలిని జాదవ్ మాట్లాడుతూ ఆగంతకులు సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని.. వాళ్ల ఫొటోలు, వీడియోలు సేకరించి, వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు.
అపరిచితులతో చాటింగ్ చేసి, వాళ్లకు ఫొటోలు షేర్ చేసి.. అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.

ఈ సందర్భంగా రెండు కేసులను ప్రస్తావిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. “ఇటీవల ఇద్దరు
యువతులను దుండగులు బ్లాక్ మెయిల్ చేశారు. ఫేస్ బుక్ లో అమ్మాయిలను ట్రాప్ చేసి.. వాళ్ల ఫొటోలు, వీడియోలు సేకరించారు. ఆ తర్వాత వాటిని మార్ఫింగ్ చేసి, అమ్మాయిలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రెండు
కేసుల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. ఇలా సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలను ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఎవరినిపడితే వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. “గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయొద్దు. లైక్స్,
కామెంట్లకు వాళ్ల మాయలో పడిపోవద్దు. ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దు. ఫొటోలు షేర్ చేయడం, వీడియో కాల్స్
మాట్లాడటం లాంటివి చేస్తే.. వాటిని దుండగులు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటివి బయటకు చెప్పుకోలేక చాలామంది బాధితులు నరకం అనుభవిస్తున్నారని శాలిని జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ కవిత, అధ్యాపకులు శ్రీమణి ఉన్నారు.


SAKSHITHA NEWS