Chandrababu On Quit From Politics టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తూనే.. అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు వెళదామని.. ఒకవే ప్రజలు తిరస్కరిస్తే తన నిర్ణయం ఎలా ఉంటుందో తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.. తాను పూర్తిగా క్లారిటీతో ఉన్నట్లు చెప్పారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధానాంశాలు:
- టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- అదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు
- ఈ విషయంలో తాను క్లారిటీగా ఉన్నట్లు తేల్చి చెప్పారు
ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది.. రాజకీయ పార్టీలన్నీ ఈసారి చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఓ వైపు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉంటే.. ఇటు టీడీపీ, జనసేన పార్టీలు జగన్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెబుతోంది.. ఈసారి పొత్తుతో చిత్తు చేస్తామంటూ తేల్చి చెబుతోంది. ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారికే ఉంది.. ఒకవేళ టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి ఏంటి?. అయితే ఒకవేళ అధికారంలోకి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చంద్రబాబు స్వయంగా చెప్పేశారు. ఒక్కమాటలో తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు.