SAKSHITHA NEWS

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే బడ్జెట్ సమావేశాల కోసం అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ఎలాంటి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. సంచలనాల విషయం ఎలా ఉన్నా మధ్యంతర బడ్జెట్ సంస్కరణాత్మకంగానే ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం చేయగా- దేశంలో అప్రకటిత నియంతృత్వం నడుస్తోందని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి.


ఈ ఏడాది లోక్​సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు అవసరమయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ పెడతారు. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. మధ్యంతర బడ్జెట్​లో కొత్త పథకాలు, పన్నుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, మధ్యంతర బడ్జెట్​లోనూ కీలక ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో నిర్మలమ్మ పద్దుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ నిర్మలా సీతారామన్​కు ఆరోది కానుంది.

Whatsapp Image 2024 01 30 At 7.08.34 Pm

SAKSHITHA NEWS