జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమిషనర్ రామకృష్ణారావు ,ప్రజాప్రతినిధులు,అధికారులు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా,స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహా నాయకుడు గాంధీజీ అని,సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన మన జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు.అదే విధంగా దేశానికి స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి త్యాగానికి గుర్తుగా దేశ వ్యాప్తంగా జనవరి 30న అమరవీరుల దినోత్సవం (షహీద్ దివాస్) గా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC ఆయా విభాగాల అధికారులు,మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…