జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ కు వినతిపత్రం సమర్పించిన ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్…
జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేయాలని కోరుతూ జిల్లా చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ కు ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు… జిల్లాలో ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, రాష్ట్రంలో అత్యధికగా ఈ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అతి తక్కువ ఉపాధ్యాయులు పని చేస్తున్నారని,అధికంగా బాలకార్మికులు ఉన్నారని,ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గద్వాల జిల్లాకు ప్రత్యేక విద్యా ప్రణాళికను రూపొందించాలని వినతిపత్రంలో కోరారు…
ఎం.వి.ఫౌండేషన్ కో ఆర్డినేటర్లు హనిమి రెడ్డి, కిరణ్ తదితరులు ఉన్నారు..