SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో నేటి పరిస్థుతులను పరిశీలిస్తే అభివృద్ది చెందిన పాఠ్యాంశాలు, మౌళిక వసతులు భాగున్నాయని వివిధ రాష్ట్రాల విధ్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యా భోధన, అభివృద్ధి వసతులపై రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యాశాఖ అధికారుల బృందం బుధవారం తిరుపతిలోని ఎస్.పి.జె.ఎన్. మునిసిపల్ హైస్కూల్ ను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తో కలిసి పరిశీలించారు. తరగతి గదుల్లో భోదిస్తున్న పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసారు. హైస్కూల్లోని తరగతి గదులను, డిజిటల్ బోర్డులను పరిశీలించారు.

నాడు నేడు స్కూల్ పనుల క్రింద అభివృద్ది పరిచిన తరగతి గదుల నిర్మాణాలను, మరుగుదొడ్ల పనితీరును, అదేవిధంగా నోటీస్ బోర్డు ద్వారా విధ్యార్ధిని, విధ్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫాం, బూట్లు, పుస్తకాలు, బ్యాగులను ఇచ్చే కేటగిరిని ప్రసంశించారు. విధ్యార్థులకు అవసరమైన త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఆర్వో సిస్టమ్ పనితీరును పరిశీలించి, స్వయంగా ఆ నీటిని త్రాగి భాగుందన్నారు. ప్రతిరోజు విధ్యార్ధిని, విధ్యార్ధులకు రోజుకోక రకం అందిస్తున్న భోజనం వివరాలను బృందం తెలుసుకొని, భోజనాన్ని రుచి చూసి భాగుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పనుల ద్వారా చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్, విద్యాశాఖ ఆర్జేడి వెంకటకృష్ణ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్, ఎంఈవో భాలాజి, హైస్కూల్ హెడ్ మాస్టర్ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.*

Whatsapp Image 2024 01 24 At 4.49.46 Pm

SAKSHITHA NEWS