తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ప్రక్కన భవానీనగర్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ప్రహరి గోడను ఆనుకొని భవానీనగర్ గుండా రైల్వే కాలనీ వైపుగా 500 మీటర్ల పొడవుతో వెలుతున్న కాలువను నూతనంగా నిర్మించడం జరిగిందని, దానిపై స్లాబ్ వేసి రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ రహదారి పూర్తి అయితే చుట్టు ప్రక్కల చాలా ప్రాంతాలకు సౌకర్యవంతమైన రహదారిగా ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే కాలువను పటిష్టంగా నిర్మించి, దానిపై స్లాబ్ ను వేయడంతో బాటు సిసి రోడ్డు పనులు కూడా పూర్తి అయినట్లు తెలిపారు. లైటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యిందన్నారు. ఇక రోడ్డుపై రెడియం స్టిక్కర్లు, దర్మో ప్లాస్ట్ లైన్స్ వేయడంతో పూర్తి అవుతుందన్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అన్ని పనులు పూర్తి చేసి రోడ్డు ప్రారంభోత్సవానికి సిద్దం చేయించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. కమిషనర్ వెంట తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి, కాంట్రాక్టర్ సహాన్ వున్నారు.*