SAKSHITHA NEWS

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో IT కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే గాంధీ కి అభినందనల వెల్లువ

జనం మెచ్చిన నేత…. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ…

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కి శుభాకాంక్షలు తెలిపిన IT కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు,తదితరులు

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించిన శుభసందర్బంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో IT కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన సభలో మర్యాదపూర్వకంగా కలిసి హర్షం వ్యక్తం చేస్తూ ,శాలవతో సత్కరిస్తూ అభినందనలు తెలియచేసిన IT కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు,తదితరులు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ IT కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులకు ఎల్లవేళలా ఋణపడి ఉంటానని, నా పై చూపిన ఆధారభిమానంలకు ధన్యుడినని, అన్ని కాలనీలను సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తానని, నా మీద విశ్వాసం ఉంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళల ఋణపడి ఉంటనాని , నన్ను వెన్నంటి నడిపించిన కేసీఆర్ కి , కేటీఆర్ కి, మన BRS పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పోరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు,ఉద్యమకారులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు,కాలనీ అసోసియేషన్ సభ్యులు అందరికీ నా పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను గాంధీ తెలియచేసారు.మరింత భాద్యతగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో IT కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, తాత కర్ణాకర్ జనరల్ సెక్రటరీ , మహేందర్ ట్రెజరర్, సభ్యులు నాగిరెడ్డి, సంజయ్, వేణు, మధు,చంద్రశేఖర్, రఘు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS